మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామ రావు గారి పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10 గంట ల 10 నిమిషాల కార్యక్రమం లో భాగంగా ఈ రోజు ఉదయం 10.10 నిమిషాలకు జిల్లా కలెక్టర్ హరి చందన గారి నివాస ఆవరణలో దోమల నిర్ములన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటి ఆవరణలో ఉన్న పూల కుండీలో, తొట్టి లను కడిగి వాటిలో ఉన్న నీటిని మర్చి దోమలు నివసించే ప్రాంతాల ను గుర్తించి దోమల నిర్ములన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ డెంగ్యూ మరియు మలేరియా దోమల ద్వారా వచ్చే వ్యాధులకు నిర్ములన లో భాగంగా ప్రతి ఒక్కరు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు తమ ఇంటిలో దోమలు నివాసం ఉండే ప్రాంత లైన పూల కుందిలు, వాటర్ ట్యాంక్ లు శుభ్రం పరిచి దోమల ను నిర్ములించాలని కోరారు. దోమల ను నిర్ములించేందుకు ప్రతి ఒక్కరు ప్రజా ప్రతి నిధులు, ప్రజలు స్వచ్చందంగా పాల్గొని తమ తమ ఆరోగ్యాన్ని కాపాడు కోవాలని కోరారు. అదే విదంగా జిల్లా రెవెన్యూ అధికారి చీర్ల శ్రీనివాస్ తమ ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంకును శుభ్రపరచి నీరు నిలువ ఉన్న ప్రాంతాలను శుభ్రం చేశారు..... జిల్లా పౌర సంబంధాల అధికారి నారాయణ పెట్ ద్వారా జారీ చేయబడినది.
Comments
Post a Comment