Minister Of agriculture Sangyreddy Niranjan Reddy Organized A farmer's Awareness program New Agriculture policy 2020 held At Narayanapet. V Srinivas Goud Minister Of Excise And Prohibition, Dist Collector Harichandan IAS, Narayanpet MLA S Rajendar Reddy, Maktal MLA Ram Mohan Reddy, MLC Kasireddy And Other's Also participated.
وزیر زراعت سنگی ریڈی نرنجن ریڈی نے کسان بیداری پروگرام نیا زراعت پالیسی 2020 کا انعقاد نارائن پیٹ میں کیا۔ وی سرینواس گوڈ وزیر ایکسائز اینڈ ممنوعہ ، ڈسٹرکٹ کلکٹر ہریچندنا آئی اے ایس ، نارائن پیٹ کے ایم ایل اے ایس راجندر ریڈی ، مکتل کے ایم ایل اے رام موہن ریڈی ، ایم ایل سی کاسی ریڈی اور دیگر نے بھی شرکت کی۔
నూతన వ్యవసాయ విధానంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న టిఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ,మంత్రులు, ఎమ్మెల్యేలు.
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సూచనల మేరకు నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంజన గార్డెన్ లో ఏర్పాటు చేసిన నూతన వ్యవసాయ విధానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి తగు సూచనలు చేశారు. ఈ సమావేశంలో నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ నారాయణపేట కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత కూడా ఇప్పటికీ వ్యవసాయదారులు కు సంబంధించిన కోల్డ్ స్టోరేజ్ లు లేవని నారాయణపేట జిల్లాలోని మరికల్ దగ్గర అనువైన పరిస్థితులు ఉన్నాయని ఆ ప్రాంతంలో రైల్వే స్టేషన్ తో పాటు జాతీయ రహదారి కూడా ఉన్నందున ఆ ప్రాంతాల్లో రైతులకు సంబంధించిన గిడ్డంగులు ఏర్పాటు చేయాలని కోరారు. ఆ తర్వాత రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాబోయే రోజులలో గ్రామ,మండల ,జిల్లా స్థాయిలో రైతు సంఘాలను ఏర్పాటు చేస్తామని ఈ సంఘాల ద్వారా ఎప్పటికప్పుడు రైతు సమస్యలను రైతులకు సూచనలు ఇస్తాయని ఎల్లప్పుడూ అందుబాటులో ఈ సంఘాలు ఉంటాయని ఆయన వివరించారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ఉమ్మడి జిల్లాలో నీటి సమస్యను పరిష్కరించి అలాగే ఇక్కడ పండిన పంటలను దేశ స్థాయిలో కాకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి అయ్యే విధంగా ఇక్కడి పంటలను ప్రోత్సహిస్తామని ఆయన సూచించారు. ఆ తర్వాత రాజేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ మంత్రులు ఎమ్మెల్యేలు లు వివరించిన సమస్యలను సలహాలను రాష్ట్ర సీఎం దృష్టికి తీసుకు వెళ్తానని ఇక్కడ వ్యవసాయదారుల సమస్యలను పరిష్కరించే దిశగా చేపడతామని చెప్పారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరిచందన, ఆర్ డి ఓ, ఆయా విభాగాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Post a Comment