State Municipalities should Disinfect Household Water in all Municipal Towns this Month

        డెంగ్యూ, మలేరియా,చికెన్ గున్యా వంటి జ్వరాలు సోకకుండా ఈ నెల 10వ తేదీన ఉదయం 10 గంటల 10 నిమిషాలకు అన్ని మున్సిపల్ పట్టణాలలో ప్రతి ఇంట్లో ఉన్న నిలువ నీటిని పారబోయాలని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే .తారకరామారావుఅన్నారు.
       శనివారం ఆయన హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్  అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు . ఇండ్లలో ఎక్కువ కాలం నీరు నిలువ ఉంచుకోవడం వల్ల డెంగ్యూ, మలేరియా ,చికెన్ గున్యా వంటి వ్యాధులు  సోకే ప్రమాదం ఉందని అందువల్ల ఈ వ్యాధులు సోకకుండా ఇంట్లో  నీటి తోట్లు,డ్రమ్ములు,సంపులలో నిలువ ఉన్న  నీటిని పారబోయాలని ఆయన చెప్పారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని మంత్రి సూచించారు .
        మున్సిపల్ పట్టణాలలో నూటికి నూరు శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని మంత్రి తెలిపారు.
      
             నాలాలు శుభ్ర పరిచిన తర్వాత వచ్చిన చెత్తను అక్కడే పరవేయకుండా ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేయాలని అన్నారు.
           పట్టణాలలోని అన్ని తాగు నీటి ట్యాంకులను శుభ్రం చేయాలని మంత్రి ఆదేశించారు.
        మున్సిపాలిటీలోని  పారిశుధ్య సిబ్బంది అందరికీ తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు,శాని టైజర్ ఉండేలా చూడాలని, ఎవరైనా ఇవి లేకుండా పని చేస్తే సంబంధిత మున్సిపల్ కమిషనర్ పై చర్య తీసుకుంటామని హెచ్చరించారు.
         వారానికి ఒకసారి పారిశుధ్య సిబ్బంది అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని  మంత్రి ఆదేశించారు.          మటన్, చికెన్ షాప్ ల నుండి వెలువడే  వ్యర్థాలను  డిస్పోస్ చేసే విషయమై వెంటనే మటన్,చికెన్ ఎక్కడ పడితే అక్కడ వేయకుండా  షాపుల యజమానులతో సమావేశం నిర్వహించాలని మంత్రి చెప్పారు.
          మున్సిపల్ పట్టణాలలో  టాయిలెట్ల నిర్మాణాన్నీ వేగవంతం చేయాలని   మంత్రి ఆదేశించారు.
          జిల్లా  రెవిన్యూ అధికారి   శ్రీనివాసులు  మాట్లాడుతూ నారాయణ పెట్,  మక్తల్ ,కోస్గి  మూడు  మున్సిపాలిటీల పరిధిలో 80% ఆస్తి పన్ను వసూలు చేయడం జరిగిందని , రెండు మున్సిపాల్టీలో  లో మాత్రం ఇంకా  ఆస్తిపన్ను వసూలుచేస్తున్నట్లు  చెప్పారు., 100% ఆస్తిపన్ను వసూలు చేస్తామని  ఆయన తెలిపారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల 10 నిముషాలు కార్యక్రమాన్ని  చేపడతామని తెలిపారు. 
  ఈ వీడియో కాన్ఫరెన్స్ కు మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాస్, పావని, జాన్ శ్యామ్ సన్  తదితరులు హాజరయ్యారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతి నిధులు అందరు రేపు ఉదయం  10 గంటలకు 10 నిముషాలు ఈ కార్యక్రమాన్ని  చేపట్టాలని ఆయన తెలిపారు... 
......జిల్లా  పౌరసంబంధాల అధికారి నారాయణ పెట్  ద్వారా  జారీ చేయబడినది

Comments