دیگر ریاستوں اور علاقوں سے آنے والےلوگوں کو ہوم کوآرانٹائن میں رکھا جائےگا

          ఇతర రాష్ట్రాలు , ప్రాంతాల నుండి వచ్చిన వారిని తప్పనిసరిగా హోమ్ క్వారన్ టైన్ లో ఉంచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
         శనివారం ఆయన హైదరాబాద్ నుండి  అన్ని జిల్లాల   వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కరోనా  వైరస్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
         ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు తప్పనిసరిగా 14 నుండి 28 రోజుల పాటు ఇండ్లలోనే స్వీయ నియంత్రణ పాటిస్తూ ఉండేలా చూడాలని చెప్పారు .వైద్యాధికారులు తప్పనిసరిగా ఇళ్లిళ్ళు సర్వే నిర్వహించి నివేదికను పంపించాలని  అన్నారు.ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారికి  ప్రతిరోజు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఎవరైనా టీబి, షుగర్  వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లైతే వారికి నెలకు సరిపోయే మందులను ఇవ్వాలని మంత్రి సూచించారు .కరోనా వైరస్ కారణంగా  ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పుల శాతం తగ్గి పోయిందని, అందువల్ల 100% కాన్పులు   పెంచాలని మంత్రి సూచించారు .అంతేకాక ఇమ్మునైజేషన్  కూడా 100% చేయాలని అన్నారు.కరోనా కారణంగా వీటిని ఆపడానికి వీలు లేదని మంత్రి చెప్పారు. ఇంకా ఈ వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి కంటైన్మెంటు జోన్ లలో చేపట్టవలసిన పనులు, డాక్టర్ చెకప్ ,తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
                 జిల్లా వైద్యాధికారిణి  డాక్టర్ శైలజ  డాక్టర్ సిద్దప్ప ,జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్  మల్లికార్జున  తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు .

Comments