రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు

రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి ఆర్టీసీ బస్సులు రోడ్డు ఎక్కడానికి అనుమతినిచ్చిన విషయం విధితమే....
ఈ నేపథ్యంలో మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో మొత్తాన్ని తనిఖీ చేసి...
కరోణ వ్యాప్తి కట్టడి కోసం ఆర్టీసీ బస్సుల్లో తీసుకుంటున్న చర్యల గురించి ఆర్టీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు...
ప్రతి బస్సును శానిటైజ్ చేయాలని మంత్రి సూచించారు...
మాస్కులు ధరించని వారిని ఎట్టి పరిస్థితుల్లో బస్సులోకి అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు...
ఈ సందర్భంగా మంత్రి ప్రయాణికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని తెలంగాణ ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన చర్యల వల్ల తెలంగాణ ఆర్టీసీ లాభాల బాటన ప్రయాణిస్తున్నట్లు తెలిపారు...
ప్రైవేటు రవాణా వ్యవస్థ తో పోలిస్తే ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఆర్టీసీ లో ప్రమాదాల శాతం తక్కువ అని గతంలోనే నిరూపణ అయిందని కాబట్టి ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో కూడా ఆర్టీసీ ఏ సురక్షితం అన్న భావన లో నుండే సీఎం కేసీఆర్ ఆర్టీసీ సేవలను పునరుద్ధరించినట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు...
స్వయంగా రాష్ట్ర మంత్రి ఆర్టీసీపై ప్రయాణికులకు విశ్వసనీయతను పెంచేందుకు ఆర్టీసీ బస్సులోనే మహబూబ్నగర్ నుండి హైదరాబాద్ వరకు ప్రయాణించడం మంత్రి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు.

https://youtu.be/ffqPRkrZE_k

Comments